Saturday, November 23, 2024

Sabarimala భక్తులకు ఉచిత బీమా..

తిరువనంతపురం: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవంబర్‌ 16 నుంచి ప్రారంభం కానున్న శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని ట్రావన్‌కోర్‌ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఆలయ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ రూ.5 లక్షల వరకు ఉచిత బీమా కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు లేదా ఏ విపత్తు లేదా సహజ మరణం అయినా రూ.5 లక్షల బీమా సొమ్ము సదరు కుటుంబానికి అందించాలని నిర్ణయించారు. అలాగే మృతదేహాన్ని ఉచితంగా స్వస్థలాలకు చేర్చాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

శబరిమలకు వచ్చే భక్తులందరికీ ఈ ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. బీమా ప్రీమియం సొమ్ము సదరు సంస్థకు ఆలయ బోర్డు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అయ్యప్పస్వామి భక్తులు తమ వెంట తప్పనిసరిగా ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డు లేదా పాన్‌ కార్డు లాంటివి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆలయ బోర్డు భక్తులకు సూచన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement