పాట్నా: కంటిలో పొర వచ్చింది… చూపు సరిగా లేదని హాస్పటల్ కి వెళ్తే … ఉన్న చూపు పోయింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రం ముజఫర్‌పుర్‌లో చోటుచేసుకుంది. ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కంటి చూపుతో బాధపడుతున్న వ్యక్తులు పదుల సంఖ్యలో హాజరయ్యారు. అందులో 25మందికి కేటరాక్ట్ ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స అనంతరం కంట్లో మంట, నొప్పిగా ఉందని బాధితులు వాపోయినా వైద్యులు పట్టించుకోలేదు. చుక్కల మందు ఇచ్చి పంపించారు. బాధితుల్లో నలుగురి కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిగిలిన వారూ తమకు దగ్గరలో ఉన్న వివిధ ఆస్పత్రుల్లో చేరి వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిందని, దాంతోనే సమస్యలొచ్చాయని వైద్యులు తెలిపారు. బాధితుల మాత్రం వైద్యుల నిర్లక్ష్యంతోనే తాము కంటి చూపు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
చూపు కోసం వెళ్తే….
Advertisement
తాజా వార్తలు
Advertisement