హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వచ్చేఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ కోచింగ్‌ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ ఆయా జిల్లా అధికారులు, కాలేజీల ప్రిన్సిపాల్స్, నోడల్ అధికారులకు ఆదేశించారు. ఉత్సాహవంతులైన విద్యార్థులను ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో గుర్తించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ తరగతులు నిర్వహించాలని కోరారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఫిబ్రవరిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏప్రిల్ మే నెలలో జరిగే ఇంటెన్సీవ్ సమ్మర్ ఉచిత ఎంసెట్-2023 కోచింగ్‌కు ఎంపిక చేయనున్నారు. ప్రతి జిల్లా నుండి 50 మంది అమ్మాయిలు, 50 మంది అబ్బాయిలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. అందుకు కావాల్సిన ఫ్యాకల్టిdని కూడా ఎంపిక చేయాలని సూచించారు. ఈ అంశాలపై దృష్టి సారించి ప్రతి కాలేజీలో ఎంసెట్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement