రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు (గురువారం) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 27,862 పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. విద్యాసంస్థలకు అందజేస్తున్న ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని ప్రకటించారు.