Friday, November 22, 2024

20 నుంచి వర్సిటీల్లో ఉచిత కోచింగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈనెల 15న ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథ నానికి అధికారుల నుంచి స్పందన వచ్చింది. యూనివర్శిటీల్లో ‘కోచింగ్‌ సెంటర్లు ఎక్కడ?’ అనే కథనంపై యూనివర్శిటీలు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పం దించాయి. యూనివర్శిటీల్లో కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఆరాతీసి నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఈనెల 20 నుంచి ఆరు యూనివర్శిటీల్లో సివిల్స్‌, గ్రూప్స్‌, పోలీస్‌ ఇతర ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఉచిత కోచింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో సాంప్రదాయ కోర్సులను అందించే ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్శిటీల్లో చదివే విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వనున్నారు. కోచింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం ఆరు వర్శిటీలకు కలిపి రూ.18 లక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే మంజూరు చేసింది.

ఇందులో ఉస్మానియా వర్శిటీకు రూ.5 లక్షలు, కాకతీయ వర్శిటీకు రూ.4 లక్షలు, మిగతా నాలుగు వర్శిటీలకు కలిపి రూ.9 లక్షల నిధులను విడుదల చేసింది. బ్యాచ్‌కు సుమారు 100 నుంచి 200 మంది విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి విద్యార్థులకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. యూనివర్సిటీ ఫ్యాకల్టితో పాటు ఆయా సబ్జెక్టుల నిపుణులతోనూ కోచింగ్‌ ఇచ్చేలా వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement