హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ఇవ్వనున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఉచిత కోచింగ్ సదుపాయానికి సదరమ్ సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులు అర్హులని తెలంగాణ దివ్యాంగుల వెల్ఫేర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు గురువారం బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. పట్టణాల్లో అయితే వీరి ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు, గ్రామాల్లో అయితే 1లక్షా 50 వేలు మించకూడదని తెలిపింది. ఒక్కొక్కరికి కోచింగ్‌కు రూ.20 వేల వరకు ఇవ్వనుండగా, ఇతర ఖర్చులకు రూ. 7 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. తమకు నచ్చిన సంస్థలో కోచింగ్ తీసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఒక నోటిఫికేషన్‌కు ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారికి మరో నోటిఫికేషన్‌కు వెసులుబాటు ఉండదని ప్రకటించింది. కోచింగ్ అవకాశ్ని వినియోగించుకునేవారు టీవీసీసీ.తెలంగాణ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..