హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత క్యాన్సర్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించనున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెడికల్ అంకాలజీ విభాగంలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్టులో క్యాన్సర్ నిర్ధారణ అయినా లేక ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం అయిన వారికి ఆయా టెస్టులపై 25శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆసుపత్రి మీడియా విభాగం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..