Sunday, November 24, 2024

Frank Duckworth Dies: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ కన్నుమూత

క్రికెట్‌ మ్యాచ్‌ల‌కు వర్షం అంతరాయం కలిగించినప్పుడు అభిమానులు తరుచూ వినే మాట ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి. ఈ ప‌ద్ధ‌తి ద్వారా లక్ష్యాన్ని, ఓవర్ల‌ను కుదించ‌డం జ‌రిగింద‌ని త‌ర‌చుగా విటుంటాం.

అయితే ‘డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్’ విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేసిన వారిలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న డక్‌వర్త్ ఇక లేరనే విషయాన్ని క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 1997లో టోనీ లూయిస్‌తో కలిసి ఫ్రాంక్ డక్‌వర్త్ ఈ డీఎల్ఎస్ విధానాన్ని ప్రతిపాదించారు. దీనికి ఐసీసీ 1999లో ఆమోదం తెలిపింది. తర్వాత వెంటనే వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఈ ‘డక్‌వర్త్ లూయిస్’ లో ఒకరైన లూయిస్ 2020లో మృతి చెందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement