ఫ్రాన్స్ లో కరోనా కేసులు తగ్గుముఖ పట్టాయి. ఈ క్రమంలో కరోనా ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను కూడా నేటి నుంచి ఎత్తివేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కేస్‌టెక్స్ ప్రకటించారు. కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో ముందుగా నిర్ణయించినదానికంటే 10 రోజుల ముందుగానే కర్ఫ్యూని కూడా రద్దుచేయనున్నట్లు చెప్పారు. కొన్ని మినహాయింపులతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ఎత్తివేస్తున్నామని కేస్‌టెక్స్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20 కరోనా కర్ఫ్యూని కూడా ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement