దేశంలో ఆర్థిక పరిస్థితికేం ఢోకా లేదని, కొంతకాలంగా ఆర్థిక రంగం మెరుగైన దిశలోనే సాగుతోందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇక.. అదానీ గ్రూప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో డౌన్ కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘‘ఎఫ్‌పీవోలు వస్తయి, ఎఫ్ఐఐలు పోతయి.. అంత మాత్రన గాబరా పడాల్సిందేమీ లేదు”అని సమాధానం ఇచ్చారు.. తన ఐదో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలమ్మ శనివారం మీడియాతో మాట్లాడారు. తన ఎఫ్‌పీఓను అదానీ గ్రూప్ ఉపసంహరించుకోవడం వల్ల దేశ స్థూల ఫండమెంటల్స్, దేశ ఆర్థిక ఇమేజ్ ప్రభావితం కాదని.. ఎఫ్‌పీఓలు వస్తుంటయి, పోతుంటయి.. రెగ్యులేటర్లు వాటి పని అవి చేస్తయన్నారు.
మన స్థూల ఆర్థిక మూలాధారాలు లేదా, మన ఆర్థిక వ్యవస్థ ఇమేజ్ వీటిలో ఏదీ ప్రభావితం కాలేదు. అవును, FPOలు (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌లు) వస్తాయి, FIIలు బయటకు పోతయి ”అని సీతారామన్ చెప్పారు. గత రెండు రోజుల్లో 8 బిలియన్ డాలర్ల ఫారెక్స్ వచ్చిందని, అయినా ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణ గురించి అడిగినప్పుడు, ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని స్వతంత్ర ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు ఈ అంశాన్ని పరిశీలిస్తాయన్నారు. మార్కెట్‌లలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి క్యాపిటల్ మార్కెట్‌ల వాచ్‌డాగ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఆధారం ఉందని అన్నారు.
షేర్ మార్కెట్, మార్కెట్లను ప్రైమ్ కండిషన్‌లో ఉంచడానికి.. సెబీకి అధికారం ఉంది. ఆ ప్రధాన పరిస్థితిని అలాగే ఉంచడానికి దానికి తగిన శక్తి ఉంది అని ఆమె చెప్పారు. ప్రతి మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయని.. అయితే కొన్ని రోజులుగా వృద్ధి చెందడం వల్ల భారతదేశం, దాని స్వాభావిక బలాలు రెండూ చెక్కుచెదరకుండా ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ అంశంపై ఆర్బీఐ ఇప్పటికే మాట్లాడిందని చెప్పారు.
కాగా, నిన్న ఆర్థిక మంత్రి గౌతమ్ అదానీ వ్యాపారం గురించిన వివాదం.. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని ఊహించలేదని “దేశ మార్కెట్ బాగా నియంత్రించబడింది” అని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఇదంతా టీకప్‌లో తుఫానుగా అభివర్ణించారు. ఇది స్థూల ఆర్థిక నిబంధనలు.. భారతదేశ ప్రభుత్వ ఆర్థిక సంస్థల స్థిరత్వానికి సంబంధించినదని స్పష్టం చేశారు. ఇక.. ప్రభుత్వం పాత పన్ను విధానానికి స్వస్తి పలుకుతుందనే ఊహాగానాలపై కూడా నిర్మలమ్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “పాత పన్ను విధానాన్ని అంతం చేయడానికి ఎటువంటి కాలక్రమం నిర్ణయించలేదు. ప్రభుత్వం సరళమైన కొత్త పన్ను విధానాన్ని మాత్రమే ప్రవేశపెట్టింది” అన్నారు.