ఫాక్స్‌కాన్ సంస్థ కర్నాటకలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ నుంచి 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఫాక్స్‌కాన్‌కు జూల్ 1 నాటికి భూమిని అప్పగిస్తామని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ కంపెనీ 13 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ ప్లాంట్ ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపింది.
ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతి పెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా ఉంది. యాపిల్ కంపెనీకి ఐఫోన్లను తయారు చేసిన సప్లయ్ చేస్తోంది. కర్నాటకలోని దేవహనహళ్లిలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ నుంచి సంవత్సరానికి 20 మిలియన్ల ఐఫోన్లను తయారు చేయనుంది.
- Advertisement -