భారత్ క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో ఐర్లాండ్‌తో టీమిండియా 2 టీ20 మ్యాచులు ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐర్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. టీమిండియా బీ జట్టు మాత్రమే ఐర్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్పిత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు అవకాశం లేదు. ఈ మ్యాచులు మలాహిడ్‌లో జరగనున్నాయి. సుమారు నాలుగేళ్ల తరువాత.. ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్తున్నది. చివరి సారిగా 2018లో ఐర్లాండ్‌లో పర్యటించింది. ఈ సిరీస్ కంటే ముందు స్వదేశంలో టీమిండియా 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ జూన్ 9 నుంచి 17 మధ్య జరగుతుంది. ఐపీఎల్ 2022 తరువాత భారత్ ఆటగాళ్లు నేరుగా ఈ సిరీస్ ఆడనున్నారు. ఐర్లాండ్ పర్యటన తరువాత.. ఇంగ్లండ్ వెళ్తారు.
అక్కడ గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన టెస్టు సిరీస్‌లోని ఐదో టెస్టు ఆడుతారు. కరోనా కేసులు బయటపడటంతో ఆ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇక జులై ఐదో టెస్టు మ్యాచ్ ఆడిన తరువాత.. ఇంగ్లండ్‌తో టీమిండియా 3 వన్డే మ్యాచులు, 3 టీ20 మ్యాచులు కూడా ఆడనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన ఐర్లాండ్.. వరుసగా టీ20 సిరీస్‌లు ఆడనుంది. ప్రపంచ కప్‌కు ముందు భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, జింబాబ్వే జట్లు ఐర్లాండ్ టీ20 సిరీస్‌లు ఆడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..