విశాఖ మధురవాడలోని ఆదిత్య ఫార్చున్ టవర్‌లో ఫ్లాట్ నెంబర్ 505లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బంగారునాయుడు (50), డాక్టర్ నిర్మల (44), దీపక్ (21), కశ్యప్ (19) పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గుంట్యాడకు చెందిన ఈ ఎన్నారై కుటుంబం.. బహ్రెయిన్‌లో స్థిరపడింది. నాలుగేళ్ల క్రితం తిరిగి విశాఖపట్టణానికి వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చున్ టవర్స్‌లోకి అద్దెకు వచ్చారు. ఆ అపార్ట్‌మెంట్లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. అంతలోనే ఈ ఘటన జరిగింది.
అయితే ఎన్ఆర్ఐ బంగారునాయుడు కుటుంబంలో నలుగురు సజీవదహనం కావడానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే పెద్ద కొడుకే అందర్నీ చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో అగ్ని ప్రమాదానికి ముందు గొడవ జరిగిందని.. తర్వాత మంటల వల్ల అందరికీ తీవ్ర గాయాలైనా బంగారు నాయుడు పెద్ద కుమారుడు దీపక్‌కు ఏం కాకపోవడంపై పోలీసులు దృష్టిసారించారు. దీపక్‌కు మానసిక సమస్య ఉందని తెలిపారు. అమ్మ, నాన్న, తమ్ముడితో దీపక్ ఘర్షణ పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేప్తున్నారు. కాగా ఘటన జరిగిన ఆదిత్య టవర్స్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.