Tuesday, November 26, 2024

మ‌రో నాలుగు రోజులు వ‌ర్షాలే..! ప్ర‌క‌టించిన వాతావరణ శాఖ

ప్ర‌భ‌న్యూస్ :తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ-నైరుతి దిశ నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 18న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి ఈ వాయుగుండం ఏర్పడుతుందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని… తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధాకారులు. నైరుతి దిశల నుంచి గాలులు (గం. 08-12 కి.మీ.) వీచే అవకాశం ఉంది కూడా వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement