ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌ను భద్రతా బలగాలు హతమార్చాయి.
ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నక్సల్స్‌ను ఏరివేసే ఆపరేషన్‌లో ఉండగానే ఎన్‌కౌంటర్ జరిగిందని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరాజ్ తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో జిల్లా రిజర్వ్‌గార్డ్‌లు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, జిల్లా బలగాలు పాల్గొన్నాయని తెలిపారు. ఇరువైపులా కాల్పులు నిలిచిపోగానే గడంతో ఘటనా స్థలంలో యూనిఫాంలో ఉన్న నలుగురు నక్సల్స్ మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలం నుంచి ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు.