Saturday, November 23, 2024

Followup : యమునా నదిలో పడవ మునిగి నలుగురు మృతి.. పలువురు గల్లంతు

ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో 35 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఘటనలో పలువురు ఈదుకుంటూ ప్రాణాలను దక్కించుకోగా.. మరికొందరు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా ఎస్‌పి అభినందన్‌ తెలిపారు. వీరంతా రాష్ట్రంలోని బాండా జిల్లా మర్కా నుంచి ఫేతేపూర్‌ జౌరౌలి ఘాట్‌కు వెళుతున్నట్లు తెలిపారు. పడవలో 30-35 మంది ప్రయాణిస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్షతగాత్రులను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే పడవలోని ఏడెనిమిది మంది యమునా నదిలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడినట్లు అదనపు ఎస్‌పి లక్ష్మినివాస్‌ మిశ్రా తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి ప్రాణనష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement