5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనే తుది పోటీదారుల జాబితాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ప్రకటించింది.
ఈ వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్స్ పాల్గొంటాయి. 2 నెల 26న స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. మొత్తం 4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నారు. ఇది 20 సంవత్సరాల వరకు కంపెనీలు వినియోగించుకోవచ్చు. వేలానికి 600, 700, 800, 900, 1800,2100, 2300,2500 మెగాహెడ్జ్ ఫ్రిక్వెన్సీలో రేడియో తరంగాలు అమ్మకానికి ఉంటాయి. వీటితో పాటు 3.3 నుంచి 3.67 గిగాహెడ్జ్, 26 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంటుంది. వేలంలో పాల్గొనేందుకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌గా 14 వేల కోట్లను రిలయన్స్ జియో డిపాజిట్ చేసింది. వేలంలో జియో అత్యధిక స్పెక్ట్రమ్ దక్కించుకునే అవకాశం ఉంది. డిపాజిట్ ఆధారంగా కంపెనీలకు డాట్ మెరిట్ పాయింట్లను కేటాయించింది.
కేవలం క్యాప్టివ్ ప్రయివేట్ నెట్‌వర్క్ ని ర్వాహణ కోసమే 5జీ వేలంలో పాల్గొంటున్నట్లు ప్రకటించిన అదానీ కంపెనీ దానికి అనుగుణంగానే కేవలం 100 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసింది. ఎంపిక చేసిన సర్కిల్స్‌లో మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌ను అదానీ డేటానెట్‌వర్క్ నిర్వహించనుంది. భారతీ ఎయిర్‌టెల్ 5,500 కోట్లు డిపాజిట్ చేసింది. దేశవ్యాప్తతంగా 5జీ నెట్‌వర్క్ కోసం భారతీ ఎయిర్‌టెల్ స్పెక్ట్రమ్ తీసుకోనుంది. వోడాఫోన్ ఐడియా మాత్రం 2,200 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసింది. ఇది మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపడేలా చేసింది. ఈ డిపాజిట్‌తో కంపెనీ కొన్ని ప్రాంతాలకు సరిపడే 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేయగలదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.