Wednesday, November 20, 2024

ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నిరసనలు 112 రోజులుగా కొనసాగుతున్నాయి. అయితే కేంద్రం నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో రైతు సంఘాలు మరోసారి భారత్ బంద్ కు సిద్ధమవుతున్నాయి. తాజాగా రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తున్నట్టు ఎస్కేఎమ్ వెల్లడించింది. హోలీ పర్వదినం సందర్భంగా వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేస్తామని రైతు సంఘం నేతలు తెలిపారు. కాగా ఈ బంద్ కు అన్ని వాణిజ్య, రవాణా, విద్యార్థి, యువత, మహిళా సంఘాలు, ఇతర వర్గాలు మద్దతు ప్రకటిస్తామని ప్రతిజ్ఞ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement