Arrest | వైసీపీ మాజీ ఎంపీ బీద మస్తాన్‌రావు కూతురు అరెస్టు..

యాక్సిడెంట్‌ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కూతురు మాధురి అరెస్ట్‌ అయ్యారు. చెన్నైలోని బిసెంట్‌నగర్‌లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ క్రమంలో మాధురి నిర్లక్ష్యంగా కారు నడిపి యువకుడి మృతికి కారణమైనట్లుగా గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Exit mobile version