Friday, November 22, 2024

Sports | టాప్‌ 100 నుంచి నాదల్‌ ఔట్‌

మాజీ ప్రపంచ నంబర్‌ 1 టెన్నిస్‌ ప్లేయర్‌ రాఫెల్‌ నాదల్‌ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున కీలక టోర్నీలకు దూరమవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో కిందకు జారుతూ వస్తున్నాడు. ప్రస్తుతం టాప్‌ 100 నుంచి ఔటయ్యాడు. 136వ ర్యాంకుకు పడిపోయాడు. అతడి 20 ఏళ్ల కెరీర్‌లో ఇదే అత్యల్ప ర్యాంకు కావడం గమనార్హం. టెన్నిస్‌ దిగ్గజ త్రయంలో ఒకడైన నాదల్‌ ఖాతాలో ప్రస్తుతం 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement