Friday, November 22, 2024

అధికారమున్నా చేతులు కట్టేశారు : ఇమ్రాన్‌ఖాన్‌..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆర్మీపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. మిలటరీ సాయంతో 2018లో అధికారంలోకి వచ్చిన తన ప్రభుత్వం చాలా బలహీన ప్రభుత్వమని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజార్టీ లేనందువల్ల, ఇరత పార్టీల సాయం తీసుకోవడం జరిగిందని ఖాన్‌ వెల్లడించారు. అయితే, ప్రతి ఒక్కరూ తన ప్రభుత్వాన్ని భయపెట్టి బ్లాక్‌మెయిల్‌ చేశారని ఇమ్రాన్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి తాను ప్రధానమంత్రినైనా, ఆ అధికారం కేవలం పేరుకే అని, నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉందో, ఎవరు చెలాయించారో అందరికీ తెలుసని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వంపై అమెరికా కుట్ర చేసిందని, అందుకే, అధికారం కోల్పోయానని ఆయన ఆరోపించారు. చైనా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాక్‌ ప్రభుత్వం అనుసరించిన కొత్త విదేశాంగవిధానం అగ్రదేశం అమెరికాకు కంటగింపుగా మారిందని, అందుకే, తన ప్రభుత్వంపై కక్ష కట్టిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

తెహ్రీక్‌ ఇ – ఇన్‌సఫ్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీప్రధాని ఇమ్రాన్‌ మాట్లాడుతూ, 2018లో ఎదురైన పరిస్థితుల్లోనే మరోసారి అధికారం వస్తే, మళ్లి ఎన్నికలకు వెళ్లి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు. దీంతో డెబ్బయి ఐదేళ్ల పాకిస్థాన్‌ పార్లమెంట్‌ చరిత్రలో మొదటిసారి అవిశ్వాసతీర్మానంలో ఓడిపోయిన ప్రధానిగా మిగిలారు. పాకిస్థాన్‌కు శక్తివంతమైన మిలటరీ అవసరమే కానీ, అంతకంటే బలమైన పార్లమెంటరీ వ్యవస్థ కూడా ఉండాలని, రెండు వ్యవస్థలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పాక్‌ మిలటరీ దేశ ప్రజలకు కొంత చేసిందని, ఇంకా ఎంతో చేసే అవకాశం ఉందని ఆయన బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement