దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ కరోనా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని వదలడం లేదు. తాజాగా, జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. తనకు తన భార్య చెన్నమ్మకు కరోనా వైరస్ సోకినట్టు దేవెగౌడ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. తమను కలిసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, కరోనా వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు.
మరోవైపు దేవెగౌడ త్వరగా కోలుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ట్విట్ చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని, యథావిధిగా వారి పనికి తిరిగి వస్తారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు.