టీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చేకూరి కాశయ్య మంగళవారం నాడు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా కాశయ్య సేవలందించారు. ఈ నేపథ్యంలో కాశయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ అభ్యుదయవాదిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఒక నిస్వార్థమైన రాజకీయ నేత అని అన్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయతీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్ఞుడిని తెలంగాణ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement