Friday, November 22, 2024

TS | బీఆర్ఎస్‌కు మ‌రో షాక్.. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మ‌రో షాక్ తగిలింది. వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.

పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అరూరి రమేష్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement