Monday, December 9, 2024

TG | బంజారాహిల్స్ పీఎస్ ఎదుట మాజీ మంత్రి ఎర్రబెల్లి ధర్నా !

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టేషన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బైఠాయించారు. అరెస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. కోర్టుకు పంపకుండా సమయాన్ని విచారణ పేరుతో వృథా చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసుల‌పై మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement