పోలవరం ప్రాజెక్టును ఎత్తిపోతలుగా మార్చడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కమిషన్ల కోసం రివర్స్ టెండరింగ్ డ్రామాతో జరుగుతున్న పనులు ఆపారని.. ఏడాదికి కనీసం ఒక్కశాతం పనులు కూడా ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నఏ ఒక్క ఎంపీ అయినా నిధుల కోసం అడిగారా అని ప్రశ్నించారు. వారిపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. స్వార్ధం కోసం ప్రజలను బలిచేయడమే అని, సీఎం జగన్ పోలవరం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ‘‘ప్రాజెక్టును బ్యారేజిగా మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి?’’ అని దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement