మాజీ మంత్రి బాబు మోహన్.. జోగిపేట బీజేపీ కార్యకర్తను దూషించాడు. నువ్వెంత.. నీ బతుకెంత..? అంటూ బీజేపీ కార్యకర్త వెంకటరమణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు గల్లీ లీడర్‌వి.. నేను రాష్ట్ర నాయకుడిని అంటూ.. మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందాం అని వెంకటరమణకు బాబు మోహన్ సవాల్ విసిరారు. చివరికి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని సైతం విడిచిపెట్టలేదు. కావాలంటే తాను బీజేపీకి రాజీనామా కూడా చేస్తానన్నారు. బాబు మోహన్ – బీజేపీ కార్యకర్త వెంకటరమణ మధ్య జరిగిన కాల్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వెంకటరమణతో మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో సంభాషణ బాబు మోహన్ మాట్లాడిందేనా, ఆయన మాదిరిగా ఎవరైనా మాట్లాడారా అనే విషయం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement