కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలలో సవరణలు చేస్తామని చెబుతుండగా, వాటిని పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో చర్చలు ఫలించట్లేదు. అయితే తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని రైతు సంఘ నాయకులు రాకేష్ తికాయత్ అన్నారు. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా నాయకులను కేంద్ర సర్కారు చర్చలకు ఆహ్వానించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కావాలని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నామని, ఈ ఏడాది జనవరి 22న ఆ చర్చలు ఎక్కడైతే ముగిశాయో.. తిరిగి అక్కడి నుంచే మళ్లీ ప్రారంభం కావాలని ఆయన చెప్పారు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనేదే తమ డిమాండ్ అని, తమ డిమాండ్లు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement