హైదరాబాద్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ (33) గుండెపోటుతో శనివారం కన్నుమూశాడు. అతడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. అశ్విన్ యాదవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. 2007లో మొహాలీలో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. 2008-09 సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీపై 52 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇది అతని కేరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. చివరిగా 2009లో ముంబైతో రంజీ మ్యాచ్ ఆడాడు.
‘అశ్విన్ యాదవ్ మరణించాడనే వార్త వినడం బాధ కలిగించింది. అశ్విన్ యాదవ్ చాల జోవియల్‌గా, సరదాగా ఉండే వ్యక్తి,. ఎప్పుడూ జట్టు కోసం కష్టపడే వ్యక్తి. మంచి ఫాస్ట్ బౌలర్. ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’అని ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశారు.