Friday, November 22, 2024

స్వరాష్ట్రంలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం : మంత్రి తలసాని

రాష్ట్రంలో గ్రంథాల‌యాల‌కు పూర్వ వైభవం తీసుకొస్తున్నామ‌ని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నగరంలోని తార్నాక లో రూ. 84 లక్షలతో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాల‌యాలు అభివృద్ధి చెందితే ఎంతో మందిని విద్యావంతుల‌ను చేస్తుంద‌న్నారు. విద్యార్థుల‌కు పోటీ ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన అన్ని ర‌కాల మెటీరియ‌ల్ అందుబాటులో ఉంటుంద‌న్నారు. మంచిగా చ‌దువుకుని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించే అవ‌కాశం ఉంద‌న్నారు. గత ప్రభుత్వాలు గ్రంథాలయాలను పట్టించుకోలేదని అన్నారు. అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని వసతులతో గ్రంథాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు కావలసిన పుస్తకాలను, అన్నపూర్ణ భోజనం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. నగరంలో 14 గ్రంథాలయాలు మంజూరు కాగా వీటీలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement