Tuesday, November 26, 2024

Preneet Kaur: బీజేపీలో చేరిన మాజీ సీఎం భార్య

గతేడాది సస్పెండ్‌కు గురైన కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఇవాళ‌ బీజేపీలో చేరారు. పాటియాలా ఎంపీగా ఉన్న ఆమెను గత ఏడాది కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ వైదొలిగారు. అనంతరం సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం బీజేపీలో విలీనం చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో కౌర్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ‌ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో కౌర్ బీజేపీలో చేరారు.

ఈ సంద్భంగా ప్రధాని మోడీపై కౌర్ ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి మోడీ చేసిన కృషిని ఆమె అభినందించారు. తాను బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని కౌర్ పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో లోక్‌సభ, అసెంబ్లీలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. అందరూ కలిసికట్టుగా ప్రధాని మోడీని, ఆయన విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె చెప్పుకొచ్చారు. కౌర్ వంటి నేతలను చేర్చుకోవడం వల్ల పంజాబ్‌లో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వ్యాఖ్యానించారు. ఎన్నో కమిటీల్లో పనిచేసి ఆమె.. తన సత్తా ఏంటో ప్రణీత్ కౌర్ నిరూపించుకున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు బీజేపీలోకి వస్తే పార్టీ బలపడుతుందని వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement