Tuesday, September 24, 2024

Breaking: మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 2000-2011 వరకు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

భట్టాచార్య 80 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గురువారం ఆయన మృతి వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. గురువారం బుద్ధదేవ్ భట్టాచార్య మృతి వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

బుద్ధదేవ్ భట్టాచార్య నవంబర్ 2000 నుంచి మే 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు. భట్టాచార్య దక్షిణ కోల్ కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఒక చిన్న రెండు గదుల ప్రభుత్వ అపార్ట్ మెంట్లో నివసిస్తున్నారు. 2011 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బుద్ధదేవ్ 2015లో సీపీఎం పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2018లో రాష్ట్ర సచివాలయ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. 2000లో పార్టీ సీనియర్ నేత జ్యోతిబసు నుంచి బుద్ధదేవ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement