Friday, November 22, 2024

తెలంగాణ హైకోర్టు మాజీ సీజే సతీష్‌చంద్ర డీపీ.. 2 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఢిల్లి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఫోటోతో వాట్సప్‌ గ్రూప్‌ సృష్టించి సైబర్‌ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న అధికారి వద్ద డబ్బు గుంజేశారు. సతీష్‌చంద్ర శర్మ ఫోటోను వాట్సప్‌ డీపీగా పెట్టి డబ్బులు కావాలంటూ ఆ అధికారి నుంచి కేటుగాళ్లు రెండు లక్షలు దోచేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన సతీష్‌చంద్ర శర్మ ఇటీవల ఢిల్లి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన ఫోటోను వాట్సప్‌ గ్రూపులో పెట్టి తెలంగాణ హైకోర్టులో సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న శ్రీమన్నారాయణ అనే అధికారికి సతీష్‌చంద్రశర్మ పేరుతో మెసేజ్‌ చేసినట్టు సందేశం పంపారు. తానిప్పుడు ఒక ప్రత్యేక సమావేశంలో ఉన్నానని అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని కానీ తన బ్యాంకు కార్డులన్నీ బ్లాక్‌ అయ్యాయని అమెజాన్‌ నుంచి పంపిస్తున్నానని దాన్ని క్లిక్‌ చేసి రూ.2 లక్షల విలువజేసే గిఫ్ట్‌ కార్డులు పంపించాలని సైబర్‌ నేరగాళ్లు సతీష్‌చంద్రశర్మ మెసేజ్‌ చేసినట్టు సదరు సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపారు.

తన సందేశం పంపింది సీజే అని భావించి శ్రీమన్నారాయణ సైబర్‌ నేరగాళ్లు చెప్పిన విధంగా రూ.2 లక్షల గిఫ్ట్‌కార్డులు పంపించి డబ్బును కోల్పోయారు. ఆ తర్వాత సీజే నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మెసేజ్‌ వచ్చిన మొబైల్‌ నెంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ రావడంతో తాను మోసపోయానని భావించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారెవరూ ఇలా డబ్బులు అడగరని అలా అడిగినపుడు అది సైబర్‌ నేరగాళ్ల పనే అని గుర్తించాలని పోలీసులు సూచించారు. అమెజాన్‌ గిఫ్ట్‌ అని చెబితే అది సైబర్‌ నేరస్తులు మోసం చేయడానికి అనే విషయం గ్రహించాలని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement