Tuesday, November 26, 2024

సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత

సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కరోనా బారినపడి ఆయన మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం వేకువజామున 4.30 గంటలకు ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. రంజిత్ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. డిసెంబరు 2012 నుంచి 2014 వరకు రెండేళ్ల పాటు ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌ పదవితో పాటు ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్(ITBP) డైరెక్టర్ జనరల్ (DG), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) చీఫ్ తదితర పలు కీలక హోదాల్లో ఆయన సేవలందించారు.

1953 మార్చి 27న జంషెడ్‌పూర్‌లో రంజిత్ సిన్హా జన్మించారు. పాట్నా యూనివర్సిటీలో జియోలజిస్ట్‌గా శిక్షణపొందారు. 21 ఏళ్ల వయస్సులో బీహార్ క్యాడర్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. బీహార్‌ ప్రభుత్వంలో పలు హోదాల్లో పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌గా నియామకం కావడానికి ముందు సీబీఐ పాట్నా, ఢిల్లీ కార్యాలయాల్లో సీనియర్ హోదాల్లో పనిచేశారు. శ్రీనగర్‌, ఢిల్లీల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ హోదాల్లో కూడా ఆయన పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement