రూర్కెలాలోని బిర్సా ముండా హాకీ స్టేడియంలో సోమవారం నుండి జాతీయ సబ్-జూనియర్ పురుషుల శిబిరం ప్రారంభంకానుంది. ఈ క్యాంపు తర్వాత యూరప్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీంతో లెజెండరీ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్ ఆధ్వర్యంలో 40 మంది సబ్-జూనియర్ పురుషుల హాకీ ఆటగాళ్ల బృందం వారి నైపుణ్యాలను మెరుగుపరుకోనున్నారు.
హాకీ ఇండియా ఇటీవల జాతీయ కోచింగ్ క్యాంప్ కోసం 40 మంది సభ్యుల సబ్-జూనియర్ కోర్ క్రూప్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ 40 మంది ఆటగాళ్లకి భారత మాజీ కెప్టెన్ సర్దార్ మెంటర్-కమ్-కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా, భారత హాకీ జట్టుకు మంచి ఆటగాళ్లను అందించడానికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని సర్దార్ అన్నారు.
నేషనల్ క్యాంప్ కి ఎంపికైన 40మంది ఆటగాళ్లు..
గోల్ కీపర్లు: రాహుల్ భరద్వాజ్, అతిఫ్ ఖాన్, అభిమన్యు గౌడ.
డిఫెండర్లు: సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్, మిథ్లేష్ సింగ్, నితిన్, సోహిల్ అలీ, సమీ రిజ్వాన్, ప్రదీప్ మండల్, రోహిత్ కులు, విశాల్ పాండే, అషు మౌర్య, ఉజ్వల్ పాల్.
మిడ్‌ఫీల్డర్లు: నీరజ్, రోహిత్ టిర్కీ, ఘురాన్ లోహ్రా, రోహిత్ ప్రధాన్, సురేష్ శర్మ, ప్రబ్జోత్ సింగ్, మన్మీత్ సింగ్ రాయ్, అరుణ్ జె, రాహుల్ రాజ్‌భర్, రాహుల్ యాదవ్, అఫ్రిది, బిజయ్ షా.
ఫార్వర్డ్‌లు: గురుప్రీత్ సింగ్, సృజన్ యాదవ్, హ్యాపీ, సునీల్, రితేంద్ర ప్రతాప్ సింగ్, ఆషిర్ ఆదిల్ ఖాన్, డియోనాథ్ నన్వర్, దీపక్ ప్రధాన్, యోజిన్ మింజ్, హర్షదీప్ సింగ్, కేతన్ కుష్వాహా, రోహిత్ ఇరెంగ్‌బామ్ సింగ్, అజీత్ యాదవ్, సుందరజిత్ ఎమ్, ముహమ్మద్ జైద్.