జాతీయ భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్, ఇంచార్జి మున్షీ సమక్షంలో జితేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించగా, భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకి నిరాశే ఎదురైంది. దీంతో అసంతృప్తికి లోనైన జితేందర్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement