హైదరాబాద్, ఆంధ్రప్రభ : వైఎస్ జగన్ ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. ఆయనను రాష్ట్ర నీటిపారుల శాఖ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సర్కార్‌లో ఆయన ప్రధాన సలహాదారు బాధ్యతలనునిర్వహించారు. కాగా కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనను పదవీ బాధ్యతలనుంచితప్పించారు.
ఈ నేపథ్యంలో అక్కడ తొలగించిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది. నీటిపారుదల శాఖలో ఆయనకు సుధీర్గ అనుభవం, మంచి పట్టు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిపారుదల శాఖలో నెలకొన్న అవినీతి, ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కొంత ఉపయోగపడనుందని భావిస్తున్నారు.