దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే లక్షలాది మంది బలయ్యారు. తాజాగా మాజీ అటార్నీ జనరల్, పద్మవిభూషణ్ సొలీ సొరాబ్జీ (91) కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మరణించారు.
సొరాబ్జి రెండు సార్లు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. మొదటిసారి 1989-90, రెండోసారి 1998-2004 మధ్య ఏజీఐగా వ్యవహరించారు. మానవ హక్కుల కోసం ఎంతగానో పోరాడారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితులపై అధ్యయనం కోసం ఐక్యరాజ్యసమితి ఆయన్ను అక్కడికి పంపింది. ఆ తర్వాత యూఎన్‌వో ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సబ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అనేక కేసులను వాదించారు. అనేక పబ్లికేషన్లపై నిషేధాన్ని ఎత్తివేయించారు.