Friday, November 22, 2024

మైత్రీకి విదేశీ నిధులు – సినిమాల లాభాల‌లో తప్పుడు లెక్క‌లు….

టాలీవుడ్ లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ కార్యాల‌యంలోనూ, ఆ సంస్థ డైరెక్ట‌ర్లు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నివాసాల‌తో పాటు పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటిలోనూ నేటి ఉద‌యం నుంచి సోదాలు కొన‌సాగ‌తున్నాయి.. మొత్తం ఆరు ఐటి బృందాలు ఈ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నాయి.. గ‌త డిసెంబ‌ర్ లోనూ మైత్రీ కార్యాల‌యంపై ఐటి సోదాలు జ‌రిగాయి.. ఆప్పుడు దొరికిన ఆధారాలు ఆధారంగా నేడు ఐటి సోదాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.. ఈ సంస్థ‌కు అమెరికా నుంచి అయిదు వంద‌ల కోట్ల వ‌ర‌కు నిధులు అందాయ‌ని ఐటి అధికారులు అంటున్నారు.. ఈ నిధుల స్వీక‌ర‌ణ‌కు ఆర్బీఐ ఎటువంటి అనుమ‌తి లేద‌ని తెలిపారు.. ఇక డిసెంబర్‌ తనిఖీల తర్వాత జనవరిలో మైత్రీ మూవీస్‌ విడుదల చేసిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్‌ లాభాలు, చెల్లించిన ఐటీ లెక్కల్లోనూ భారీగా వ్యత్యాసం ఉన్నట్లు బయటపడింది. దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రుపుత‌న్నారు.. ఇక ఈ నిర్మాణ సంస్థ ఆధ్వ‌ర్యంలో పుష్ప 2ని అల్లు అర్జున్ తో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ది.. దీంతో సుకుమార్ కార్యాల‌యంపైనా, కొండాపూర్‌లోని ఎస్మరాల్డ్‌ ఫార్చ్యూన్‌ విల్లాస్‌లోని సుకుమార్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జ‌రుపుతున్నారు.. ఈ దాడుల నేప‌థ్యంలో పుష్ప 2 షూటింగ్ కు నేడు విరామం ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement