కరీంనగర్ : జిల్లాలో ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అడవుల నుండి ఎలుగుబంటి జనవాసాల మధ్యకు వచ్చింది. బొమ్మకల్ సమీపంలో ఎలుగుబంటి తిరగడం గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై.. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి ఎలుగుబంటిని పట్టుకునేందుకు అపరేషన్ చేపట్టారు.
దాదాపు 12 గంటల పాటు అధికారులను ముప్పు తిప్పులు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం రేకుర్తి వద్ద చిక్కింది.మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఎలుగుబంటి స్పృహా కోల్పోయింది. అనంతరం రెస్క్యూ వాహనంలో అధికారులు ఎలుగుబంటిని శనివారం జూ పార్క్‌కు తరలించారు. ఎట్టకేలకు ఎలుగుబంటి చిక్కడంతో అధికారులు, స్థానికులు ఊపీరి పీల్చుకున్నారు..