Friday, November 22, 2024

ఈనెలలో 7,432 కోట్లు తరలించిన విదేశీ ఇన్వెస్టర్లు..

ముంబాయి : విదేవీ ఫోర్టుపోలియో ఇన్వెస్టర్లు మన దేశ ఈక్విటీ మార్కెట్‌ను పెట్టుబడులను తరలిస్తునే ఉన్నారు. జులై నెలలో ఇప్పటి వరకు ఇలా 7,432 కోట్లు తరలించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం రావచ్చన్న భయాలు, డాలర్‌ అంతకంతకూ బలపడటం వంటి కారణాలతో ఎఫ్‌ పీఐలు ఈక్విటీ మార్కెట్‌లో భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. జూన్‌ నెల నుంచి చూస్తే ఇప్పటి వరకు 50,203 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గత 8 నెలలుగా మన దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తునే ఉన్నారు. ఫోరెక్స్‌ మార్కెట్‌లో కరెన్సీ విలువలు పతం కావడం, మరో వైపు డాలర్‌ బలోపేతం కావడంతో మన మార్కెట్‌ నుంచి వీరు తప్పుకుంటున్నారని జీయోజెట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన వికె విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రభావం, ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడటం వంటి పలు కారణాలతో మన దేశ మార్కెట్లతో పాటు, అనేక దేశాల్లోనూ ఇలాంటి అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయడుతున్నారు. 2020 మార్చి తరువాత జూన్‌ నెలలోనే 50,203 కోట్లు తరలిపోవడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇలా 2.25 లక్షల కోట్లు మన దేశ ఈక్విటీ మార్కెట్‌ నుంచి తరలిపోయాయి. 2008లో 52,987 కోట్లు తరలిపోవడమే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్‌. మరో వైపు మన దేశ రూపాయి డాలర్‌తో మారకంలో 80 రూపాయలకు చేరుకుంది. రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవడంలేదని విజయ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ సంక్షోభం వల్ల తలెత్తిన పరిస్థితులు, అమెరికా, దాని మిత్రపక్షాలు విధించిన ఆంక్షల మూలంగా చాలా దేశాలు కరెన్సీ విలువను కాపాడుకునేందుకు గట్టిగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితిలోనే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. దీని ప్రభావం రూపాయిపై మరింత అధికంగా పడుతుండటంతో రోజు రోజుకు పతనం అవుతోంది.

రూపాయి పతనం- ఎగుమతులకు ఊతం
డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 రూపాయిలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఎగుమతుల విషయంలో పోటీతత్వం పెరిగిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం వల్ల మనం దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంలేదు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తరిగిపోతున్నాయి. వాణిజ్యలోటు అంతకంతకూ పెరుగుతోంది. రూపాయి విలువ తగ్గిపోవడంతో దిగుమతులు భారం అవుతుంటే, ఎగుమతులు మాత్రం ప్రోత్సహకరంగా ఉంటున్నాయని మార్కెట్‌ వర్గాలు వి శ్లేషిస్తున్నారు. ఎందుకంటే మన ఎగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయి. డాలర్‌ విలువ పెరిగినందున ఆ మేరకు దిగుమతులకు ఎక్కువ ఆదాయం వస్తోంది. రూపాయి పతనంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ మన ఎగుమతుల విలవ పెరుగుతుందని , అదే సమయంలో మన ఈక్విటీ మార్కెట్‌ను తరలిపోతు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వీరు అంచనా వేస్తున్నారు. విదేశీ వాణిజ్యలోటు 2022 జూన్‌ నాటికి 26.18 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021 జూన్‌లో ఇది 9.60 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 172.72 శాతం పెరిగింది. ముడి చమురు దిగుమతులు జూన్‌లో 21.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇదే కాలంలో బొగ్గు దిగుమతులు 6.76 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021 జూన్‌లో బొగ్గు దిగుమతులు 1.88 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి. వి ద్యుత్‌ ఉత్పత్తిలో తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గు వాడాలన్న నిబంధనతోనే బొగ్గు దిగుమతులు ఈ స్థాయిలో పెరిగియాన్న విమర్శలు ఉన్నాయి. విదేశీ వాణిజ్యలోటు భారీగా పెరుగుతుంటే, మన దేశ అవసరాలకు అంతగా ఉపయోగపడని విదేశీ బొగ్గు దిగుమతులను ఎందుకు తప్పనిసరి చేయడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement