ఓ ఫారెన్ అమ్మాయికి జిలేబి నచ్చలేదట..వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ గౌడ అనే భారతీయుడు కొలంబియాకు చెందిన కాలెన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన జీవితంలో తొలిసారి జిలేబీ తినడాన్ని కెమెరాలో బంధించాడు. ‘కనీసం ట్రై చేస్తోంది కదా.. తనను క్యాన్సిల్ చెయ్యకండి’ అని క్యాప్షన్‌తో హనుమాన్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో స్టార్టింగ్ లో అందమైన చీరకట్టు, బొట్టుతో కనిపించిన కాలెన్.. భర్త చెప్పడంతో జిలేబీ తీసుకుంది. కొంచెం తిన్న ఆమె.. ‘ఇదేంటి ఇంత జిగురుగా (స్లైమీగా) ఉంది అని అడిగింది. బలవంతం మీద మరో చిన్న ముక్క కొరికి ‘హనీ.. ఇక వద్దు’ అంటూ చేతిలోని జిలేబీని పక్కన ఉన్న వాళ్లకు ఇచ్చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు జిలేబీ నచ్చకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరొకరేమో ‘భారతీయ వంటకాలు తినేటప్పుడు ఏమీ ఆలోచించకూడదు. వాటి రుచిని ఆస్వాదించాలంతే’ అని కామెంట్ చేశారు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement