రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది.. ఈ దాడులలో రష్యా కూడా భారీ స్థాయిలోనే నష్టపోయింది. అనేకమంది రష్యా సైనికులు మరనించారు.. పెద్ద ఎత్తున రష్యా ఆయుధాలు ఉక్రెయిన్ సేనల పరమయ్యాయి. పింట్సర్ గగనతల రక్షణ వ్యవస్థ, కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైల్, కేఏ-52 హెలికాప్టర్, బర్నల్ టి గగనతల రక్షణ వ్యవస్థ, వంటి ఆయుదాలు ఉక్రేయిన్ సేనలకు చిక్కియి.. ఇవేకాకుండా ఇంకా అనేక ఆయుధాలు కూడా ఉక్రెయిన్ దళాల చేతచిక్కాయి. ఈ ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను విప్పదీసి చూసిన ఉక్రెయిన్ ఇంజినీర్లకు గట్టి షాక్ తగిలింది.
రష్యా ఆయుధాల్లో వినియోగించిన కీలకమైన ఎలక్ట్రానిక్ చిప్ లన్నీ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో తయారైనవే.. వీటిలో కొన్ని చైనా నుంచి సమీకరించినవి కాగా, వీటిలో కొన్ని చిప్ లను డిష్ వాషర్లు, రిఫ్రిజిరేటర్ల నుంచి సేకరించిరాని గుర్తించారు ఉక్రేయిన్ ఇంజనీర్లు.. దీంతో రష్యన్ల తెలివితేటలు ఎలాంటివో అర్థమవుతోంది. ఉక్రెయిన్ పై దాడి ప్రకటించగానే, రష్యాపై పాశ్చాత్యదేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా ఆయుధాల్లో విదేశీ చిప్ సెట్లు దర్శనవమివ్వడం అమెరికా తదితర దేశాలకు మింగుడుపడడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..