Tuesday, November 19, 2024

మూడు రోజుల పాటు అక్కడక్కడా మోస్తారు వర్షాలు.. పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న మూడు రోజులు గజగజా వణికించే చలితోపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12 వరకు తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. 13న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని హెచ్చరించింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండడంతో రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం ఎక్కువగా ఉండనుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫాన్‌గా మారిందని వెల్లడించింది. తుఫాన్‌ కారణంగా చలికి తోడు శీతలగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రెండు, మూడు రోజులుగా చలి రాష్ట్రాన్ని గజగజ వణికిస్తోంది. సాయంత్రం 5 దాటితే బయట తిరగలేకపోతున్నామని, ఇక ఉదయం 10 తర్వాతనే చలి తీవ్రత తగ్గుతోందని ప్రజలు వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూూబ్‌నగర్‌, రంగారెడ్డి తదితర జిల్లాలు చలిగుప్పటి వణికిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement