Saturday, November 23, 2024

మళ్ళీ ఫోన్ పే ఫస్ట్ ర్యాంక్ కొట్టింది

ఆన్లైన్ లావాదేవీల్లో.. వాల్ మాక్టు చెందిన ఫోన్ పే జనవరి,ఫిబ్రవరి నెలల్లో వరుసగా మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో మొత్తం 22,292.90 మిలియన్‌ యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇందులో ఫోన్ పే వాటా 42.5 శాతంగా ఉంది. ఆన్లైన్ లావాదేవీల్లో గూగుల్ పేతో పాటు పేటీఎంలు కూడా రాణిస్తున్నాయి. ఫోన్ పే 975.53 మిలియన్ల లావాదేవీలుజరిపింది. దీని విలువ రూ.1.89 లక్షలకోట్లు. 2021, జనవరిలో 968.72 మిలియ v ట్రాన్సాక్షన్లు జరగ్గా.. దీని విలువ రూ.1.92 లక్షల కోట్లు. జనవరితో పోలిస్తే.. ఫిబ్రవరిలోలావాదేవీల సంఖ్య పెరిగినా… విలువ మాత్రం కొంత తగ్గింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం… డిసెంబర్, 2020లో గూగుల్ పే తనటాప్ స్థానాన్ని కోల్పోయింది.

ఫిబ్రవరిలో 827.86 మిలియన్లలావాదేవీలు (మొత్తం లావాదే వీల్లో 36 శాతం)జరిగాయి.దీని విలువ రూ.1.74 లక్షల కోటుగా ఉండింది. ఫోన్ పే తరువాత రెండో స్థానంలో గూగుల్ పే ఉంది. జనవరిలో 853.53మిలియన్ల లావాదేవీలు జరిగాయి. దీని విలువ రూ.1.77 లక్షలకోట్లు. ఫిబ్రవరిలో ఫోన్ పే,గూగుల్ సంయుక్తంగా 78.5శాతం లావాదేవీలను దక్కించుకున్నాయి. ఇక పేటీఎం మూడోస్థానంలో ఉంది. 340.71మిలియన్ల లావాదేవీలు జరిగాయి. దీని విలువ రూ38,493.52కోట్లు.జనవరిలో 382.69 మిలియన్ లావాదేవీలు జరగ్గా..దీని విలువ రూ.37,845.76 కోట్లు. నాన్ బ్యాంక్ యూపీఐయాలు అమెజాన్ పే 44.22మిలియన్లు, వాట్సాప్ 0.55 మిలియన్లు, జియో పేమెంట్ బ్యాంక్ 0.36 మిలియన్లు, మొబిక్విక్ 1.92 మిలియన్ల లావాదేవీలు ఫిబ్రవరిలో జరిపాయి. ఏప్రిల్ తరువాత తొలిసారి భారీగా యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. 2021,జనవరిలో 2302.78మిలియన్ల లావాదేవీలు జరగ్గా.. విలువరూ.4,31,181.89
కోట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement