Friday, November 22, 2024

ఉప రాష్ట్రపతి ఎన్నికకు.. నేటి నుంచే నామినేషన్లు

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం మొదలుకానుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 68శాతం ప్రకారం.. పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలి. ఈ క్రమంలో జూన్‌ 29న ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. వాటిని 20న పరిశీలిస్తారు. ఉపసంహరణకు తుది గడువు జులై 22. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న నిర్వహిస్తారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. నామినేటెడ్‌ సభ్యులకూ అర్హత ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 788 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ఎన్నికలు ఆగస్ట్‌ 6న జరుగనుండగా.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాలు తమ తరఫున అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement