క్రికెటర్ కెఎల్ రాహుల్ తో బాలీవుడ్ నటి అథియా శెట్టి వివాహం ఘనంగా జరిగింది. నవ వధువు అథియా తన పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయ డిజైనర్ డ్రెస్ లో ఎంతో అందంగా ట్రెడిషనల్ గా కనిపించింది. ఎందుకంటే అతి సున్నితమైన గులాబీ రంగు చికంకారీ లెహంగాను ఎంపిక చేయడంలోనే పెద్ద సక్సెసైంది. అథియా భర్త KL రాహుల్ ఎంబ్రాయిడరీ ఐవరీ షేర్వానీలో అందంగా కనిపించాడు. అతియా లెహెంగా తయారీకి ఆకట్టుకునే వెడ్డింగ్ గెటప్ కి ఎంత సమయం పట్టి ఉంటుంది.. అంటూ ఇప్పుడు అభిమానుల్లో ఆరాలు మొదలయ్యాయి. ఈ లెహంగా కోసం డిజైనర్లు చాలా సమయం వెచ్చించాల్సి వచ్చిందని తెలిసింది. అతియా శెట్టి లవ్లీ పింక్ వెడ్డింగ్ లెహంగా మేకింగ్ చేతితో నేసినది.
జర్దోజీ- జాలీ వర్క్ డిజైన్ తో పట్టులో డిజైన్ చేసినది. లెహంగాలో ఒక అందమైన వీల్ .. దుపట్టా ఉన్నాయి. ఇది సిల్క్ ఆర్గాన్జాతో సంక్లిష్టమైన చేతిపనితో తయారు చేసినది. ప్రఖ్యాత వోగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిజైనర్ అనామిక ఖన్నా అతియా లెహంగా తయారు చేయడానికి 10000 గంటలు పట్టిందని వెల్లడించారు. వివాహ లెహంగా వెనుక వధువు ప్రేరణ చాలా తోడ్పడిందని కూడా ఆమె వెల్లడించింది. అనామిక ఇంకా మాట్లాడుతూ.. అథియా అభిరుచి చాలా బాగుంది. తను చాలా అందంగా ఉంది. ఆమె తన స్పెషల్ డే కోసం ప్రత్యేకంగా ఏదైనా డిజైనర్ లుక్ ని డెవలప్ చేయాలని కోరింది. అథియా శరీరంలో సున్నితమైన భాగం ప్రతి బిట్ రాయల్ గా కనిపించాలని భావించి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ లెహంగాను డిజైన్ చేసాం అని వెల్లడించింది.