Wednesday, November 20, 2024

14వ వరల్డ్‌ ఈస్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్స్‌కు.. టీమిండియా క్వాలిఫై

ఇండోనేసియాలోని బాలీలో ఇంటర్నేషన్‌ ఈస్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐఈఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో జరుగనున్న 14వ వరల్డ్‌ ఈస్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీకి భారత బృందం ఎంపికైంది. నేషనల్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్‌- నేషనల్‌ ఈస్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్స్‌ (ఎన్‌ఈఎస్‌సీ 2022) టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈస్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్‌ నిర్వహించింది.

దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్స్‌తో ఆన్‌లైన్‌ ద్వారా ఎన్‌ఈఎస్‌సీ 2022 టోర్నీ నిర్వహించగా, అత్యుత్తమ వ్యూహాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసింది. 16జట్లతో టీమిండియా తలపడనుంది. బాలీలో నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 7 వరకు వరల్డ్‌ ఈస్పోర్ట్స్‌ చాఫింయన్‌షిప్‌ టోర్నీ జరుగనుంది. ఇందులో గెలిచిన క్రీడాకారుడికి రూ.4 కోట్ల బహుమతి అందుకోనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement