వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: బీఎస్సీ నర్సింగ్, పోస్టు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదలచేసింది. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్) 4 సంవత్సరాల డిగ్రీ కోర్స్, పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ 2 ఏండ్లు డిగ్రీ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్‌్ ఫిజియోథెరిఫీ(బీపీటీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మాప్ ఆఫ్ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈనెల 8వ తేది సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.