న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని 9 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు రూ.2250 కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులిచ్చినట్టు పేర్కొంది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వంగా సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్‌లను సమర్పించిన తర్వాత నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ ప్రత్యేక నిధులు అందించినట్లు తెలిపారు. తేడాది విడుదల చేసిన చివరి విడత రూ.450 కోట్లకు తెలంగాణ రాష్ట్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించిందని ఆయన బదులిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..